గల్లాతో నాకు ప్రాణహాని

 

నిందితులపపై కఠిన చర్యలు తీసుకోవాలి

కట్టెల ఆక్రమ రవాణా పై దర్యాప్తు జరపాలి

బాధితుడు గాడి కొయ్య హనుమంతరావు

‌ఖమ్మం ప్రతినిధి మార్చ్ 25 (ప్రజాబలం) ఖమ్మం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ వల్ల తనకు ప్రాణహాని ఉందని జిల్లాలోని వైరా మండలం పాలడుగు గ్రామనివాసి గాడికోయ హనుమంతరావు ఆరోపించారు .శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో హనుమంతరావు మాట్లాడారు . గత పది సంవత్సరాల నుండి తనకు గల్లాతో పరిచయం ఉందని , తాను గల్లా కు వరుసకు సోదరుడు అయినటువంటి రవి దగ్గర డ్రైవర్గా పనిచేశానని వెల్లడించారు . కొన్ని వ్యక్తిగత కారణవల్ల తనపై గల్లా కక్ష కట్టారని విమర్శించారు . ఆనాటి నుండి తననీ గల్లా వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని , ఆయన కారణంగా తాను ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజుల క్రితం బండి లక్ష్మణ్ అనే కట్టెల వ్యాపారి బోనకల్ , మధిర పరిధిలో వ్యాపారం నిర్వహిస్తుంటాడని , నాలుగు రోజుల క్రితం సీతానగరంలో అక్రమంగా నరికి రవాణా సిద్ధమైన టేకు మొద్దులను లారీలతో రవాణా చేస్తుండగా తాను అడ్డుకొని , ఫారెస్ట్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో వారు టేకు మోద్దుల రవాణాకు సిద్ధమైన లారీని స్వాధీనం చేసుకొని , నిఘా పెట్టారని వెల్లడించారు . ఈ కారణంగా ఆ రాత్రి తనను లక్ష్మణ్ మనుషులు కర్రలతో దాడి చేయడానికి వెంబడించగా, తన స్నేహితుల కారణంగా తప్పించుకున్న నని తెలిపారు . భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మరియు కట్టెల వ్యాపారి లక్ష్మణులు అక్రమంగా బినామీ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు . గల్లా తో పాటు లక్ష్మణు ల కారణంగా తనకే కాకుండా తన స్నేహితులను కూడా టార్గెట్ చేశారని , అక్రమంగా కేసులు నమో చేయడంతో పాటు బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు . ఇప్పుడే కాక భవిష్యత్తులో సైతం తనకు గల్లా సత్యనారాయణ తో ప్రాణహాని ఉందని వెంటనే నిందితులైన గల్లా సత్యనారాయణ , లక్ష్మణులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు . తనకేదైనా అయితే దానికిగల్లా సత్యనారాయణ మాత్రమేనని స్పష్టం చేశారు . ఫారెస్ట్ అధికారులు అక్రమ రవాణా టేకు మోద్దుల కేసు విషయంలో కేసును నీరు గాడ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు . ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయ పై దృష్టి సారించి తనకు న్యాయం చేయాలని బాధితుడు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు . ఈ విలేకరుల సమావేశంలో నాగరాజు , జానీ పాష తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking