ఘనంగా జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానం.

 

ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు అందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 25:
2023 సంవత్సరానికి గాను ఉత్తమ జాతీయ పంచాయతీలు గా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వరంగల్,హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య , సిక్తపట్నాయక్ల అధ్యక్షతన రెండు జిల్లాల పరిధిలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ఈ అవార్డులను ప్రధానం చేశారు. ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులను అయా గ్రామ పంచాయతీల పరిధిలోగల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు అందుకునేలా గ్రామపంచాయతీలను తీర్చి దిద్దిన నాయకులను ప్రశంసించారు. అలాగే జిల్లాలలోని ప్రతి మండలాలలో ఉన్న గ్రామాలు ఉత్తమ జాతీయ పంచాయతీలుగా ఎన్నిక అయ్యేందుకు శుచి శుభ్రత, పారిశుద్ధ కార్యక్రమాలు, హరితహారం, గ్రామ అభివృద్ధి పట్ల ఆరోగ్యకరమైన పోటీ తత్వంతో ముందుకు పోతూ జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా మరిన్ని గ్రామాలు ఎన్నిక అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, రెండు జిల్లాల అడిషనల్ కలెక్టర్ లు, ప్రభుత్వ అధికారులు గ్రామపంచాయతీ పెద్దలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking