నా బలం ప్రజలు కార్యకర్తలే ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం నగరం 54వ డివిజన్ తిరుపతి స్టీల్ అధినేత రావులపాటి నరేష్ నివాసంలో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు ఖమ్మం సమగ్రాభివృద్ధి కోసం నేను చేసిన పనులు మీ స్వీయ అనుభవంలోనే ఉన్నాయి ఒకప్పుడు ఖమ్మం ఇప్పుడు ఖమ్మం పోల్చి చూస్తే నక్కకు నాగ లోకం లాగా ఉంది. కనీస మౌలిక సదుపాయాలు లేని స్థాయి నుండి నేడు అన్ని రంగాల్లో ప్రగతి కనిపిస్తాఉంది ఎవరెన్ని కుట్రలు చేసినా ఇక్కడ గెలిచేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పక్షాన నిలిచి కేసీఅర్ కి హ్యాట్రిక్ అందించాలని కోరారు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

కార్యక్రమంలో చేకురు సత్యం బాబు ఎలినేని రమణ కార్పొరేటర్ రాపర్తి శరత్ ఎన్.సురేందర్ రెడ్డి, పోట్ల శ్రీకాంత్, బత్తుల మురళీ, పిల్లి శేఖర్, కిలారు బాబ్జీ, సంపత్, ప్రభు, నరేందర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking