వికలాంగులను కించపరిచిన ఐఏఎస్ స్మిత సభర్వాల్ పై కేసు పెట్టిన ఎన్. పి.ఆర్.డి నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఫసి యుద్దీన్
తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని డిమాండ్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా వికలాంగులను కించపరిచిన ఐఏఎస్ స్మిత సభర్వాల్ ను అనర్హురాలిగా ప్రకటించాలని,తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఎన్ పి ఆర్ డి. జిల్లా అధ్యక్షులు ఫసి యుద్దీన్ నిర్మల్ సీఐ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా. అధ్యక్షులు ఫసి యుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్అధికారి శ్రీ మతి స్మిత సభర్వాల్ వికలాంగులను కించపరిచే విదంగా జులై 21నాడు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినారని అన్నారు
ఆమె పెట్టిన పోస్ట్ ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం మరియు 2016 ఆర్ పి డబ్ల్యు డి చట్టంలో పేర్కొన్న సమానత్వం మరియు వికలాంగుల పట్ల వివక్షతకు పూర్తి భిన్నమైందని పేర్కొన్నారు. వికలాంగులను కించపరిచే ఉద్దేశంతో బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని వికలాంగులను అగౌరవపరిచెందుకు ప్రయత్నం చేసిన ఆమె పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనీ,
2016 ఆర్.పి డబ్ల్యూ డి చట్టం సెక్షన్ 92( ఏ ),(బి),(ఈ) ల ప్రకారం ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో
ఫసి యుద్దీన్ జిల్లా అధ్యక్షులు,ఎన్ పి ఆర్ డి.నిర్మల్ జిల్లా నాయకులు గంగారం ఉన్నారు