డ్రగ్స్ కి బానిస యువకులకు కావద్దు

 

యువకులకు సిఐ అల్లం నరేందర్ కౌన్సెలింగ్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 24 : గంజాయి,డ్రగ్స్ లాంటి వాటికి అలవాటుపడి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్ అన్నారు.బుధవారం లక్షెట్టిపేట పట్టణ పోలీసు స్టేషన్ లో గంజాయి,డ్రగ్స్ కి అలవాటు పడిన పలువురు యువకులను,వాళ్ళ తల్లితండ్రులను స్టేషన్ కి పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… గంజాయి,డ్రగ్స్ వాడిన వాటిని సరఫరా చేసి చాలా పెద్ద నేరం అన్నారు. గంజాయిపై ప్రభుత్వము చాలా సీరియస్ గా ఉందని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని ప్రత్యేక పోలీసుల ప్రర్యవేక్షణ నడుస్తుందన్నారు.ఒకసారి గంజాయి లాంటి వాటి కేసుల్లో ఇరుకుటే ఎవరు రక్షించలేరని పిల్లల్ని అనుక్షణం పర్యవేక్షించాల్సిన బాధ్యత తల్లి తండ్రుల దేనని అవగాహన కల్పించారు. లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలో ఎవరైనా గంజాయి డ్రగ్స్ వాడిన వాటిని విక్రయించినట్లు తెలిసిన లక్షెట్టిపేట ఎస్సై 87126 56545 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పిన వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట ఎస్సై సతీష్ తో పాటు యువకులు,వాళ్ళ తల్లితండ్రులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking