ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 25 : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ప్రభుత్వం చేపట్టిన మన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటి సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అదనం కలెక్టర్ రెవెన్యూ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ మండలంలోని ఆర్ కె- 5 గని ఆవరణలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి.సంజీవ రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం చేపట్టిన 75 వ వనమహోత్సవం -2024 కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధించడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయడం తెలిపారు. మొక్కలు నాటే లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో మొక్కలు సిద్ధం చేయడం జరుగుతుందని,శాఖల వారిగా లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని,సకాలంలో లక్ష్యాన్ని పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.జి.ఎం. పర్సనల్ పి అరవింద్ రావు ఇంచార్జ్ ఏరియా ఇంజనీర్ యాదయ్య, గని మేనేజర్ అబ్దుల్ ఖాదర్,సంబంధిత అధికారులు, కార్మిక యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.