సైనిక్‌పురి, ఉప్పల్‌లలో దేవాలయాలను సందర్శించిన నాగపంచమి బృందం

హైదరాబాద్ మార్చ్ 25);స్టార్‌మా లో త్వరలో ప్రసారం కానున్న నాగపంచమి సీరియల్‌ బృందం హైదరాబాద్ లోని సైనిక్‌పురి, ఉప్పల్‌లలో దేవాలయాలను సందర్శించి నాగదేవతల అనుగ్రహాన్ని కోరారు. నాగదేవతగా పాములను కొలిచే మనిషి, ఆ పామును చూడగానే విష సర్పంగా భావించి చంపేయడానికి సిద్ధమవుతాడు. పగబట్టిన పాము, మనిషి బంధం చూపుతూ ఎన్నో కథలు చాలామందికి తెలుసు. సైన్స్‌ , అసలు పాములు పగబట్టవని , అదంతా ఉత్తిదే అని కొట్టి పడేస్తే, నమ్మకాలు మాత్రం అబ్బే, పాములు పగబడతాయి, తమకు అనుభవాలున్నాయనే వారు కొందరు. పాములకు, మనుషులకు మధ్య ఈ పగ,ప్రతీకారాలేనా ? ఇంకేమీ లేవా ? అని అంటే చాలానే ఉన్నాయి. ఆ బంధాలనే తాము చూపుతామంటూ స్టార్‌ మా వినూత్నమైన కథనంతో నాగపంచమి సీరియల్‌తో వస్తుంది. పాలు పోసి కాపాడమ్మా అని నిర్మలమైన మనసుతో ప్రార్ధిస్తే చాలు తానున్నాననే నాగదేవత కథనంతో తీర్చిదిద్దిన ఈ సీరియల్‌ స్టార్‌ మాలో మార్చి 27 నుంచి రాత్రి 8 గంటలకు ప్రసారం కాబోతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking