పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా కిషోర్ బాలికలకు రక్తహీనతపై అవగాహన కల్పించిన

మధిర ఐసిడిఎస్ సిడిపిఓ శారద శాంతి

ఖమ్మం ప్రతినిధి మార్చి 25 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా మధిర ప్రాజెక్ట్ లోని మధిర సెక్టార్ టు సిరిపురంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని కిషోర్ బాలికలకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో రక్తహీనత పై సిడిపిఓ శారద శాంతి అవగాహన సదస్సును నిర్వహించినారు. పాఠశాలలోని కిషోర్ బాలికలకు రక్త హీనత టెస్టులను సిరిపురం పీహెచ్ ద్వారా బాలికలకు నిర్వహించారు. సిడిపిఓ కిషోర్ బాలికలకు హిమోగ్లోబిన్ శాతం 12 నుండి 14 శాతం వరకు ఉండాలని తెలిపినారు హిమోగ్లోబిన్ శాతం పెరగటానికి తగు సూచనలు తెలియజేసినారు. అదేవిధంగా ఏసిడిపిఓ వీరభద్రమ్మ మాట్లాడుతూ పోషక విలువలతో కూడినటు వంటి చిరుధాన్యాలు ఉపయోగించటం వల్ల మనుషులు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపినారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగ సత్యవతి, మాటూరుపేట డాక్టర్ వెంకటేష్ , స్కూల్ హెచ్ఎం సలీం, ఏఎన్ఎం, ఆశలు, అంగన్వాడీ టీచర్స్ పుష్ప, దేవమణి ,స్వరూప సుశీల, మమత ,కృష్ణవేణి రమణ, నర్మద ,వెంకమ్మ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking