ఆలయాల్లో భక్తులతో మమేకమైన నామ నాగేశ్వరరావు

 

శ్రీరామ నవమి వేడుకల్లో నామ

స్థానిక నాయకులతో కలిసి పలు ఆలయాలను సందర్శించిన నామ

శ్రీసీతారాముల స్వామి వారి ఆశీస్సులు పొందిన నామ

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 17 (ప్రజాబలం) బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించి పలు ఆలయాలనుస్థానిక నేతలతో కలిసి సందర్శించి శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని , ప్రజలతో, భక్తులతో మమేకమై శ్రీ సీతారాముల స్వామి వారి ఆశీస్సులు పొందారు .ఈ సందర్భంగా పలు చోట్ల జరిగిన అన్నదానం కార్యక్రమంలో కూడా పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. తొలుత బురాన్ పురంలోని అభయాంజ నేయ స్వామి ఆలయంలో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు అందుకున్నారు .

ఎన్ఎస్పి క్యాంపు లో

ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు ఎన్ ఎస్పీ క్యాంప్ లోని రామాలయాన్ని సందర్శించి, భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్య క్రమాల్లో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర ,పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు , పార్టీ పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు, చిత్తారి సింహాద్రి యాదవ్ ,తాళ్లూరి జీవన్ , నామ సేవా సమితి నుంచి తాళ్ళూరి హరీష్, పాల్వంచ రాజేష్ ,చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరానగర్ లో

ఇందిరా నగర్ లోని పర్ణశాలను సందర్శించారు ఈ సందర్భంగా నవమి వేడుకల్లో పాల్గొని, పూజా కార్యక్రమాల్లో పాల్గొ న్నారు .ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చావా నారాయణ రావు ,సరిపూడి సతీష్, యాకూబ్ పాషా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .

టీఎన్జీవోస్ రామాలయంలో

టీఎన్జీవోస్ కోదండ రామాలయం లో జరిగిన శ్రీ సీతారాముల స్వామి కల్యాణ వేడుకల్లో కూడా నామ పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మిక్కిలినేని నరేంద్ర, నల్లమల రంజిత్ ,కర్నాటి కృష్ణ, చెరుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఇల్లందు క్రాస్ రోడ్డులో

ఇల్లందు క్రాస్ రోడ్డులోని జలాంజనేయస్వామి ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని, స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోపర్తి సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు.

గాంధీచౌక్ వేడుకల్లో నామ

గాంధీచౌక్ లో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో నామ స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులతో కలిసి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి మోహన్ రావు, వేములపల్లి వెంకటేశ్వరరావు, చిల్లంచర్ల రాధ, కురువెళ్ల జగన్, శ్రీరంగం రాధాకృష్ణ, పుల్లఖండం వినయ్ తదితరులు పాల్గొన్నారు.

గుంటుమల్లేశ్వర స్వామి టెంపుల్ లో

కాల్వోడ్డులోని గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో కన్నులపండువగా జరిగిన శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ వేడుకల్లో కూడా నామ నాగేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి పాల్గొని , పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్త జనంతో కలిసి, పూజలు చేసి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వైష్ణవి ప్రసన్న , బోజెడ్ల రామ్మోహన్, చింతపల్లి వెంకటేశ్వర్లు, బోజెడ్ల కిరణ్ కుమార్, కేసగాని రవి, మోరం పూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking