ఈనెల 18 నుంచి కలెక్టర్ ఛాంబర్ లో నామినేషన్ల స్వీకరణ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

 

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 17 (ప్రజాబలం) ఖమ్మం సాధారణ లోకసభ ఎన్నికలను పురస్కరించు కుని నేడు నోటిఫికేషన్ రానున్నందున ఖమ్మం లోకసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణ నేటి నుండి ఈ నెల 25 వరకు ఉదయం 11.00 గంటల నుండి మ. 3.00 గంటల వరకు చేపడతారు. కలెక్టరేట్ కు దరఖాస్తుల సమర్పణకు వచ్చే ప్రజలు దీనిని గమనించాలని, పై తేదీలలో సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు మాత్రమే కలెక్టరేట్ కు దరఖాస్తుదారులు రావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలని, మిగతా సమయాల్లో కలెక్టరేట్ కు వచ్చి ఇబ్బందులు పడవద్దని కలెక్టర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking