అధికారులు ఉదయం 6 గంటలకే వారి కేటాయించిన విధులకు హాజరు కావాలి

 

జిల్లా కలెక్టర్ డాక్టర్ డాక్టర్ ప్రియాంక అల

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 17 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 18వ తేదీ గురువారం జరగనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విచేయనున్నందున విధులు కేటాయించిన అధికారులు ఉదయం 6 గంటలకే కేటాయించిన విధులకు హాజరుకావాల ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గవర్నర్ పర్యటనపై బుధవారం ఐటీసీ విశ్రాంతి భవనంలో రెవెన్యూ, డిఆర్ డిఎ, జడ్పి, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరామ వేడుకలకు విధులు కేటాయించిన సెక్టార్ల అధికారులు సకాలంలో సెక్టార్లకు చేరుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారని, మహా పట్టాభిషేకం కార్యక్రమాలకు కూడా స్పూర్తితో ఉదయం 6 గంటలకు సెక్టార్లకు చేరుకొని ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ టైం టు టైం షెడ్యూల్ ఫాలో కావాలని ఆమె అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డిఆర్డిఓ విద్యాచందన, జడ్పి సీఈవో ప్రసూన రాణి, డిపిఓ చంద్రమౌళి, ఆర్డిఓలు దామోదర్ రావు, మధు, ఎస్డీసి సుమ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking