ప్రజా బలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ (సి ఈ డిఎం) ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిచే ఉచిత టీఎస్ టెట్ 2024 కోచింగ్ తరగతులు జిల్లా గవర్నమెంట్ హై స్కూల్ ఈద్గాం లో కోర్స్ కోర్స్ కోఆర్డినేటర్ అన్సార్ అహ్మద్ సాహిల్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి. జుట్టు గజేందర్ ఎస్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మరియు జే లక్ష్మణ్ ఎస్ టి యు టి ఎస్ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారిచే ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభించడం జరిగింది.ఇట్టి సందర్భంగా జుట్టు గజేందర్.మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థులు అందరూ ఈ ఉచిత కోచింగ్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది.కోర్స్ కోఆర్డినేటర్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి(సి డి పి) ఉర్దూ మీడియం పుస్తక రచయిత, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అన్సార్ అహ్మద్ సాహిల్ ఉర్దూ మీడియం లోని బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు గత 15 సంవత్సరాల నుండి వారి ఎదుగుదలకు మరియు ఉన్నత చదువులలో మోటివేషనల్ క్లాసెస్ నిర్వహిస్తూ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన పుస్తకాలను రచిస్తూ విద్యార్థుల ప్రగతికై తోడ్పాటు అందిస్తున్నారు ఈ సందర్భంగా వారు విద్యార్థులకు ఉచిత టెట్ కోచింగ్ తరగతులను సద్వినియోగం చేసుకొని మంచిర్యాంకులను రాబట్టాలని మరియు ఇంకా ఎవరైనా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వారు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో కోర్స్ కో కోఆర్డినేటర్ షేక్ నబి, మరియు టెట్ తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు మోసిన్ ఇంగ్లీష్, అబ్దుల్లా మ్యాథ్స్, జుబేర్ సోషల్, అష్రాఫ్ ఉర్దూ, అశ్వక్ ఈవీఎస్, సాదియా మ్యాథ్స్ మరియు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు