జగిత్యాల, సెప్టెంబర్ 6: బిసి సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మెటపెల్లి కి చెందిన నల్ల వెంకటేశ్వర్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మాండబెరి నరేష్ నియామక ఉత్తర్వులు
జారీచేశారు. బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజాల శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ ఆదేశాల మేరకు ఈ నియామకాన్ని చేపట్టినట్లు నరేష్ పేర్కొన్నారు. తక్షణమే ఈ నియామకం అమల్లోకి వస్తుందని బిసిల సమస్యలపై నిరంతర కృషి చేయాలని నరేష్ సూచించారు. తన నియామకానికి కృషిచేసిన అధ్యక్షులు జాజాల శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రకాష్, జిల్లా అధ్యక్షులు నరేషతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషిచేసిన ప్రతిఒక్కరిక్ వెంకటేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేశ్వర్ నియామకానికి రాష్ట్ర కార్యదర్శి గాజుల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమి రమణ, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగ జలజ, ముఖేష్ ఖన్నా, రాము, వరదసాయీ, మనోహర్, వరుణ్, రాజశేఖర్, శ్రీనివాస్, పద్మ, విజయ లక్ష్మీ లు హర్షం వ్యక్తం చేశారు.