స్మార్ట్ కిడ్జ్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 6 (ప్రజాబలం)ఖమ్మం స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో బుధవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల చిన్నారులు చిన్ని కృష్ణుడు గోపికలు రాధ వేషధారణలో అలరించారు పిల్లనగ్రోవి ఊదుతూన్న చిన్ని కృష్ణుని చుట్టూ గోపికలు చేరి నృత్యాలు చేసే సన్నివేశాలు అబ్బురపరిచాయి. చిన్నారులు ఉట్టి కొట్టే వేడుకల్లో ఆనందో త్సవాలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు నేటితరం విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నార అన్ని సంస్కృతులకు చెందిన వేడుకలు పాఠశాలలో నిర్వహించడం ద్వారా వివిధ ఆచారాల వ్యవహారాలు విద్యార్థు లు తెలుసుకునే అవకాశం లభిస్తున్నదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking