కుమారుడి పెళ్లికి రావాలని రేణుకా చౌదరి కి నామ ఆహ్వానం

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 12 (ప్రజాబలం)ఈ నెల 15వ తేదీన బాపట్లలో జరగనున్న తన కుమారుడు నామ భవ్య తేజ – శేష మనోఙ్ఞ జ్యోతి వివాహా మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి, ఆశీస్సులు అందించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మంగళవారం హైదరాబాద్ లోని స్వగృహంలో రేణుకా చౌదరిని మర్యాద పూర్వకంగా కలసి, వివాహా పత్రికను అందజేసి, ఆహ్వానించారు. నామ గారి వెంట ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిశోర్ కూడా ఉన్నారు

రేణుకా చౌదరి కి శుభాకాంక్షలు

ఇటీవల రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన
రేణుకా చౌదరిని హైదరాబాద్ లోని స్వగృహంలో మంగళవారం ఎంపీ నామ నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు బొకే అందజేసి, అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking