రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 12 మార్చ్ 2024:
మణికొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ సమయా నంతర సాయంత్రంపు అదనపు తరగతులకు హాజరయ్యే పదవ తరగతి విద్యార్థులకు సోమవారం రోజున మిఠాయి లడ్డూ, సమ్మోస్సాలను శ్రీజా హోం ఫుడ్స్ అధినేత వాసిరెడ్డి శివాజీ యొక్క అమ్మాయి శ్రీజా పుట్టిన రోజు సందర్భంగా గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ వరిష్ఠ నాగరికుల సంఘ సభ్యులు అల్పాహార పంపిణీ చేశారని అల్పాహార వ్యవస్థ చూస్తున్న వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పర్చుతు ఈ సందర్భంగా ట్రస్ట్ కోశాద్యక్షుడు దిలీప్ కక్కడ్, సభ్యులు రాజ శేఖర్, రవీంద్ర బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, బీ.ఆర్.సి కి ఎదురుగా ఉన్న గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ నివాసులు తది తరులు పాల్గొన్నారని యథాతధిగా నార్సింగీ రోడ్ లోకల స్కైలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ నివాసులు ఈ నెల 15 వరకు అల్పాహార పంపిణీ కొనసాగిస్తారని దాతలందరికీ పేరు పేరున వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతాభీ వందానలు తెలియ జేసినారు.
