సీనా హోటల్ పక్కన ఉన్న నాలను మూసివేసినారు
సూర్య మహాల్ స్లామ్ కోట్ల రూపాయల ప్రాపర్టీ, బేగంబజార్ లో హౌసింగ్ బోర్డు ప్రాపర్టీ పై నిర్మాణాలు ఎమ్మార్వ్ కు కనిపించడం లేదా
గోశామహల్ బిఆర్‌ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్
గోశామహల్ ప్రజాబలం ప్రతినిధి:మూసి పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ నాలా పరిధిలోకి రాకున్నా అనవసరంగా ఇక్కడున్న వందలాది ఇళ్ల యజమానులకు రెవెన్యూ అధికారులు భయాబ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ జిల్లా, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలకు ఫిర్యాదు చేస్తామని గోశామహల్ బిఆర్‌ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. జంగల్ విఠోభా దేవాలయం పరిసరాల్లో ఉన్న ఇండ్లను ఎలా కులుస్తారని ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్ వందల ఏళ్ల క్రితం ఇళ్లు కట్టుకున్న ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో కూల్చబోమని కేవలం నిర్మాణ దశలో ఉన్నటువంటి షెడ్లు, ఇళ్లను కూల్చివేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే వారం రోజుల క్రితం నాంపల్లి ఎమ్మార్వో, ఇరిగేషన్ అధికారులు పోలీసు బందోబస్తుతో బడేమియా పెట్రోల్ పంపు, ఉస్మాన్ షాహీ , గౌలిగూడ, సీబీఎస్ ప్రాంతాలు బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని రోడ్డు నుంచి 50 మీటర్లు మేరకు తొలగింపులు. చేపడుతామని ఈ ప్రాంతంలో ఉన్న వందలాది ఇళ్ల యజమానులకు అధికారులు చెప్పడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ ప్రాంతాలు బఫర్ జోన్ పరిధిలోకి రావని కేవలం రెవెన్యూ అధికారులు ఇక్కడున్న ఇంటి య జమానులను భయాభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదన్నారు. ఎమ్మార్వో గారికి గతంలో ఇక్కడ కొంతమంది బిల్డర్లు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కావాలంటే వాటి వివరాలను తాము ఇస్తామని… అంతే కాని పేదల ఇండ్లను కులుస్తామంటే ఊరుకోమని… బిఆర్‌ఎస్ పార్టీ తరుపున పేద ప్రజలకు అండగా ఉంటామని అన్నారు.జ్ఞన్ బాగ్ కాలనీ లో ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదని , బేగంబజార్ లో హౌసింగ్ బోర్డు ప్రాపర్టీ పై నిర్మాణాలు , సూర్య మహాల్ స్లామ్ కోట్ల రూపాయల ప్రాపర్టీ ఎమ్మార్వ్ కు కనిపించడం లేదని ఆరోపించారు. సీనా హోటల్ పక్కన ఉన్న నాలను మూసివేసి , వాటిపై బిల్డింగ్ కట్టిన ఘనత ఈ బిల్డర్ లది అని అన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా , వందేళ్ల గా అక్కడ నివసిస్తున్న ప్రజల పై పడటం భావ్యం కాదన్నారు. ఈ విషయంలో అధికారులు వెనక్కు తగ్గకపోతే , బిఆర్‌ఎస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామన్నారు. అక్రమ బిల్డర్ లకు అధికారులు అండగా ఉంటే , ప్రజల తరపున తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. త్వరలో ఈ విషయమై ఇక్కడి బస్తీవాసులతో కలిసి, హైడ్రా కమిషనర్, కలెక్టర్ ను కలవడం తో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలవనున్నట్లు ఆనంద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
Next Post