ఎక్కడ వెకిలి చేష్టలు చేసిన ఊరుకునేది లేదు.

 

కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తే ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తారు.
కల్లూరి హరికృష్ణ.

తూప్రాన్, సెప్టెంబర్, 14 ప్రజాబలం న్యూస్ :-

కాంగ్రెస్ నాయకులు ఎక్కడ వెకిలి చేష్టలు చేసిన ఊరుకునేది లేదని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం కన్వీనర్, శివ్వంపేట ఎంపిపి కల్లూరి హరి కృష్ణ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వీధి రౌడీలా ఉసిగొలుపుతు రెచ్చగొడుతున్నారని అన్నారు. బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై జరిగిన దాడి అమానుషమని దాడిని ఖండించారు. పోలీసులు ప్రత్యేక్షంగా, పరోక్షంగా సహకరించారు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గుండాలు ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధంగా వ్యవహరించడం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై జరిగిన దాడి విషయంలో పోలీస్ కమిషనర్ కి పిర్యాదు చేయడానికి వెళ్ళిన మహా నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావుతోపాటు ప్రజా ప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారని, మాజీ మంత్రులను అరెస్టు చేసి కేశంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించడం పట్ల తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. రేపు కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తే ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తారని ఏ మొఖం పెట్టుకొని సమాధానం చెప్తారని అన్నారు. జరిగిన సంఘటనలో మాజీ మంత్రి హరీష్ రావు బుజానికి దెబ్బ తగిలి విపరీతమైన నొప్పి రావడం తో ఆసుపత్రికి వెళ్లుతా అంటే పోలీసులు అతిగా ప్రవర్తించడం పై తీవ్రంగా మండి పడ్డారు. ఈ సమావేశంలో తాజా మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, శేఖర్ గౌడ్, సంతోష్, నాగేశ్వరరావు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking