85 సార్లు రక్తదానం చేసినందుకు నంది అవార్డు.

 

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), ప్రతినిధి :- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన దురిశెట్టి అరుణ్ తేజా చారి అనే యువకుడు తెలుగు చలనచిత్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి అభిమాని. మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటి నుండి ప్రతి మూడు నెలలకు ఒక మారు ఆపదలో ఉన్నవారికి, వివిధ కారణాలతో వాహన ప్రమాదంలో గాయపడ్డ వారికి ఇప్పటివరకు 85 సార్లు రక్తదానం చేసినందుకు, సామాజిక సేవకు గాను, జాతీయ నంది అవార్డుకు ఎంపికైనాడు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నారాయణ, తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జడ్జ్ చంద్రయ్య, కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు చైర్మన్ గార్ల సమక్షంలో దుర్శట్టి అరుణ్ తేజ చారిని శాలువాతో ఘనంగా సన్మానించి, నంది అవార్డును బహుకరించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న దురిశెట్టి అరుణ్ తేజ చారి మాట్లాడుతూ ఇక ముందు కూడా సామాజిక సేవలో ముఖ్యపాత్ర పోషిస్తూ, ప్రతి మూడు నెలలకు ఒక మారు స్వయంగా రక్తదానం చేస్తూ, యువకులను కూడా రక్తదానం చేసే విధంగా ప్రోత్సహిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking