రాజ్యాంగ సంస్థలైన ఈ డి, ఐ టి, సి బి ఐ సంస్థల అధికారులను దుర్వినియోగం చేస్తుంది నరేంద్ర మోడీ సర్కార్.

 

తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.

మెదక్ ప్రజా బలం న్యూస్ :-

ఢిల్లీ లో
తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంబడి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారని , కెసిఆర్ లాంటి నాయకుడు కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న అనేక రకాల సంక్షేమ అభివృద్ధి ఫలాలను చూసి ఓర్వలేక, బిఆర్ఎస్ పార్టీ స్థాపన యావత్ భారత దేశ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని ఉద్దేశంతో ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలను మంత్రులను ఎమ్మెల్సీ కవిత గారిని ఈడి నోటీసులతో మోడీ ప్రభుత్వం దుర్మార్గ పరాకాష్ట చర్యలను చేపట్టిందన్నారు, కానీ ఇలాంటి దుర్మార్గ పరాకాష్ట చర్యలకు తాటాకు చప్పళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భయపడరు అన్నారు, ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రకాల ఆటంకాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన యోధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు,

భారతదేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు, కెసిఆర్ అంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కు వణుకు పుడుతుందన్నారు, రాజకీయ దురద్దేశంతోనే ఎమ్మెల్సీ కవిత కు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు, ఎక్కడ ఢిల్లీలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కూలుతుందో అనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి పరాకాష్ట చర్యలకు పాల్పడుతుందన్నారు, ఇటువంటి పప్పులు ఇటువంటి డ్రామాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఉడకవని కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ను హెచ్చరించారు, మోడీ దుర్మార్గాలకు కాలం చెల్లిందని బిజెపి సర్కార్ను గద్దె దింపే వరకు పోరాటం ఆగదు అన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు దీనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు, కేంద్ర దర్యాప్తు సంస్థలను సిబిఐ ఈడి లాంటి సంస్థలను నరేంద్ర మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు, ఈ డి, ఐటి , దాడులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకొని ఇలాంటి దుర్మార్గపు చర్యలను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ చేపట్టడం దుర్మార్గమన్నారు, భారతదేశ ప్రజలు ఇది గమనిస్తున్నారన్నారు, ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ కూలుతుందో అనే భయంతోనే,మరియు వారి అసమర్ధ పాలన మరియు బిజెపి అవినీతి ఎక్కడ భయపడుతున్న ఉద్దేశంతో ఈరోజు కవిత గారిని ఈడి నోటీసులతో రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు, కేవలం బిజెపి స్వలాభం కోసమే రాజకీయ లబ్ధి పొందాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ చూస్తుందన్నారు,
సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందించక అవినీతిదారులకు వేల కోట్లు మాఫీ చేస్తూ ,వేలకోట్ల అవినీతి చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి ఫలాలను చూసి ఓర్వలేక కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ కుప్పకూలుతుందని అనే భయంతో ప్రతిపక్షాలను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక రాజ్యాంగ సంస్థలైన ఈ డి ,ఐ టి ,సి బి ఐ లాంటి సంస్థల అధికారులను దుర్వినియోగం చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నది నరేంద్ర మోడీ సర్కార్ అని విమర్శించారు, యావత్ భారత దేశంలోని ప్రభుత్వ ఆస్తులను ఆదానిలాంటి కార్పొరేట్ శక్తులకు అంటగడుతూ, తాకట్టు పెడుతూ దేశా ఆస్తులను అమ్మకానికి పెట్టిన ఘనత కేంద్రంలో నరేంద్ర మోడీ సార్ గారికి దక్కుతుందన్నారు,

ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు,
బండి సంజయ్ ను ఖబర్దార్ అని అన్నారు,
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చరించారు, నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుకను చీరేస్తామన్నారు,
రాబోయే రోజులలో దేశ ప్రజలు నరేంద్ర మోడీ సర్కార్ కు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking