టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నరేందుల ప్రసాద్

 

కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 18

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నరేందుల ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభల్లో ప్రసాద్ ను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు అందించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం పనిచేసే జర్నలిస్టులందరికీ అన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం అదేవిధంగా హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు జాతీయ కార్యదర్శి ఆనందం, జిల్లా కార్యదర్శి బాపురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె కరుణాకర్ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ నుండి రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ప్రసాద్ ఎన్నిక కావడం పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking