ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16 : కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి సాధ్యమని జెండా వెంకటాపూర్ గ్రామంలో డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు జెండావిష్కరించి అన్నారు.గురువారం పాదయాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న సేవలు,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాలను వివరించారు.ఈ సందర్భంగా కోక్కిరాల సురేఖ మాట్లాడుతూ… రైతులకు రుణమాఫీ ఇల్లు నిర్మించుకునే వారికి ఇల్లు మంజూరు, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు.ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల పాలిట శాపంగా మారిందని,కాబట్టి ఈ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఉపేక్షించరని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి రావడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, ఎంపీపీ అన్నం మంగ చిన్నన్న, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,సర్పంచ్ కందుల మోహన్,ఎంపీటీసీ సుజాత,సురేష్,ముత్తె సుధాకర్, సీనియర్ నాయకులు పాయల్ చిన్నయ్య,గ్రామ కాంగ్రెస్ కమిటీ జెండా వెంకటాపూర్ ఎల్తాపు భూమయ్య,రాజన్న,రామన్న, సత్తన్న చిన్నయ్య,తానుగుల మల్లేష్,రాము,సూరం రాజయ్య, మామిళ్ళ సత్తయ్య,సంఘం శ్రీనివాస్,నస్పూరి గణేష్, అతే రాజయ్య,సాయినాథ్,కారుకురి శేఖర్ కారుకూరి,చిన్న వెంకటేష్, గుత్తికొండ శ్రీధర్,షఫీ గ్రామ కాంగ్రెస్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.