జాతీయ వైద్యుల దినోత్సవం
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి: భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం ‘‘జాతీయ వైద్యుల దినోత్సవం’’ జూలై 1న జరుపుకుంటారు.
డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ (1882 జూలై 1-1962 జూలై 1) జయంతి జూలై 1న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు.
డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 1 జూలై 1882 న జన్మించాడు. 1962 లో అదే తేదీన మరణించాడు.80 సంవత్సరాల వయస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1961 ఫిబ్రవరి 4లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
వైద్యలను డాక్టర్స్ ను సన్మానించేందుకు ఆస్పత్రులు లేదా ఇతర సంస్థలు ఏర్పాటు చేయవచ్చు.
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వేడుకలు ఘనంగా జరిగాయి.
ఓజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి , సీఎస్‌ఆర్‌ఎంఓ మరియు ఇతర ఆర్‌ఎంఓ లు మరియు నర్సింగ్ సిబ్బంది మరియు ఓజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులందరినీ సూపరింటెండెంట్ అభినందించారు.