👉446 కేసుల పరిష్కారం
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి, మార్చి 11,( ప్రజాబలం ) అందోల్ జోగిపేట, జాతీయ న్యాయ అధికారి, సేవా సంస్థ ఆదేశం మేరకు, నిర్వహించిన, జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో, సంగారెడ్డి జిల్లా, జోగిపేట సివిల్ కోర్టులో న్యాయమూర్తి ధనలక్ష్మి, ఆధ్వర్యంలో, ఇరువర్గాల ఒప్పందంతో, 446, కేసుల పరిష్కారం జరిగిందని, కోర్టు అధికారులు తెలిపారు, జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో, భార్యాభర్తల, భూతగదాల, చెక్ బౌన్స్, సివిల్ కేసులు, పోలీస్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పరిష్కారం జరిగిందని, ఇరువార్గాల ఒప్పందంతో అంగీకరించిన వారికి, న్యాయమూర్తి ధనలక్ష్మి,ఒప్పంద ధ్రువపత్రాలు అందజేశారు, జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో, న్యాయవాదులు, ఎస్, కృష్ణారెడ్డి, ఎస్, నారాయణరెడ్డి, అల్లే శ్రీకాంత్. వర్మ. వెంకటకృష్ణ, మల్లేశం, షేంషేర్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.