బేటి బచావో బేటి పడావో ఆశ నోడల్ పర్సన్స్ కు అవగాహన కార్యక్రమం

 

రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి-11 (ప్రజాబలం ప్రతినిధి)

రాజన్న సిరిసిల్ల జిల్లా మంగళవారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.రజిత ఆధ్వర్యంలో (పీసీపీ ఎన్ డి టి )గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం అనే కార్యక్రమం లో భాగంగా బేటి బచావో బేటి పడావో ఆశ నోడల్ పర్సన్స్ కు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనైనది. ఈ కార్యక్రమం ఉద్దేశించి కౌమార దశలో ఉన్న పిల్లలకు వారి యొక్క ఆరోగ్యం, శారీరక ఎదుగుదల, మానసిక ఆరోగ్యంపై మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రూప్ మీటింగ్స్ ద్వారా పిల్లలకు, పెద్దలకు అవగాహన కల్పించాలని. ఈ సందర్భంగా ఆశ నోడల్ పర్సన్స్ కు సూచిస్తూ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో రాజ్ కుమార్, సిహెచ్ ఓ శాంత, హెచ్ ఈ బాలయ్య, డీడియం కార్తీక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking