టి.ఆర్.వి.కె.ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ముష్కే నరసయ్య

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 11:

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (హెచ్ 58). రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముస్కే నరసయ్యను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముస్కే నరసయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యల పట్ల కార్మికుల హక్కుల కొరకు పోరాటంలో తాను ముందుంటానని ఏలాంటి సమస్య ఉన్న కార్మికుల పక్షాన వెంటే ఉంటానని అన్నారు. నాపై నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యతను యూనియన్ అభివృద్ధి కొరకు నా వంతుగా పాటుపడతానని అన్నారు. రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి డివిజన్ నాయకులు రీజనల్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాలలోని స్నేహ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్నికైన నరసయ్య యూనియన్ నాయకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం హెచ్ 58 రాష్ట్ర డివిజన్ రీజనల్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking