ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్, మార్చి 11:
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టి.ఆర్.వి.కే.ఎస్) హెచ్ 58 నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మూషిక నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మంచిర్యాల సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ గంగాధర్, మంచిర్యాల డి.ఇ కైసర్, ఏ డి ఇ లు పాల్గొని డైరీ, క్యాలెండర్, టేబుల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ రావు, అసిస్టెంట్ సెక్రటరీ సిహెచ్ లక్ష్మణ్, రీజినల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్, మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు కొంక శ్రీనివాస్, మంచిర్యాల రీజినల్ ప్రెసిడెంట్ కొదురుపాక శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ ఆనంద్, రీజినల్ ట్రెజర్. సుధాకర్, మంచిర్యాల డివిజన్ ప్రెసిడెంట్ బి. దామోదర రాజు, మంచిర్యాల డివిజన్ సెక్రెటరీ వినోద్, మంచిర్యాల డివిజన్ ట్రెజర్ కృష్ణ, మంచిర్యాల డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పులేటి నరేష్, సెక్రెటరీ మంచిర్యాల సబ్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉస్మాన్, రూరల్ సబ్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓ శ్రీనివాస్, బెల్లంపల్లి డివిజన్ ప్రెసిడెంట్ జాల తిరుపతి, బెల్లంపల్లి డివిజన్ సెక్రెటరీ పైడాకుల తిరుపతి, బెల్లంపల్లి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం మహేశ్వర్ రెడ్డి, సబ్ డివిజన్ వర్కింగ్ ఆర్గనైజర్ పన్యాల రాజయ్య, సబ్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్, సబ్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జావాజీ మహేష్, మెరుగు మహేష్, తదితరులు పాల్గొన్నారు.