రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి-11 (ప్రజాబలం ప్రతినిధి)
భారత ప్రభుత్వం, కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకము’ రెండవ దశ దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు అనగా తేదీ: 31-03-2025 వరకు పొడిగించారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు.డా.జి. మల్సూర్ పరిశ్రమల శాఖ సంచాలకులు తెలిపారు .ఈ పథకంలోని ముఖ్యాంశాలు ఇంటర్న్ షిప్ కి ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం 5000 రూపాయలు, ఒకేసారి 6000 మంజూరు చేయబడతాయి, 12 నెలల ఇంటర్న్ షిప్ కాలవ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. ఈ ఇంటర్న్ షిప్ ద్వారా వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందగలుగుతారు , ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకుంటారు, ఇప్పటికే దాదాపు 3 లక్షలకు పైగా దరఖాస్తులు సమర్పించబడ్డాయి.ఈ ఇంటర్న్ షిప్ పథకానికి కావలసిన అర్హత ప్రమాణాలు: 21 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు, 10th, 12th, ఐటిఐ పాలిటెక్నిక్ డిప్లమా, డిగ్రీ పూర్తయి ఉండాలి. గత సంవత్సర కుటుంబ ఆదాయం 8 లక్షల లోపు కలిగి ఉండాలి.
దరఖాస్తు చేయు విధానం: pminternship. mca. gov.in పోర్టల్ సందర్శించి లాగిన్ చేయండి, మీఆసక్తులు ఆధారంగా వివిధ రంగాలలో అవకాశాలను గరిష్టంగా 5 ఇంటర్న్షిప్లను ఎంచుకోండి. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీ దరఖాస్తులను సమర్పించండి. యువత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి.సహాయం కోసం, సంప్రదించండి: 1800 11 6090 (టోల్-ఫ్రీ) లేదా pminternship.mca.gov.in ని సందర్శించండి.ఈ క్రింద అందించిన లింకుల ద్వారా వీడియోల రూపంలో మీరు పూర్తి దరఖాస్తు ప్రక్రియను చాలా వివరంగా పొందవచ్చు:
1. ໓ (2) – https://www.youtube.com/watch?v=CRUPP wlVo0
2. () – https://www.youtube.com/watch?v=WrCEpQ6BzNU
3. (2) – https://www.youtube.com/watch?v=tWRODZVbhoE
4. (১) – https://www.youtube.com/watch?v=0VCbbGfEVbA