విద్యార్థులలో జాతీయ బావాలు పెంపొందించాలి : చేగుంట మండల నోడల్ ఆఫీసర్ నీరజ

 

మెదక్ చేగుంట ఫిబ్రవరి 1 ప్రాజబలం న్యూస్:-

మెదక్ చేగుంట మండల కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మండల స్థాయి సోషల్ ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులలో జాతీయ భావాన్ని, నైతిక విలువలను, రాజ్యాంగ విలువలను బోధించాలని వారన్నారు. చేగుంట మండల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విభాగం లో మొదటి బహుమతి రేవతి, రెడ్డి పల్లి పాఠశాల,
రెండో బహుమతి ధనుష్ మోడల్ స్కూల్,
తెలుగు మీడియం విభాగం లో
మొదటి బహుమతి అశోక్ కరీంనగర్ పాఠశాల ,
రెండవ బహుమతి శ్రావణి, కరీంనగర్ పాఠశాల ,
ప్రైవేటు స్కూల్ విభాగం లో
మొదటి బహుమతి శ్రీప్రియ గీత స్కూల్,
రెండో బహుమతి శ్రీవర్షిత గీత స్కూల్ గెలుచుకున్నారు. వీరికి మండల నోడల్ ఆఫీసర్ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ ఫోరమ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంట గౌడ్ ఆంజనేయులు, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఎస్టియు మండల అధ్యక్షుడు మనోహర్ రావు,తపస్ మండల అధ్యక్షులు వెంకటేష్,శ్రీకృష్ణవేణి స్కూల్ ప్రధానోపాధ్యాయులు వివేక్,ఉపాధ్యాయులు అజిత, పద్మ,కోటయ్య,ప్రణయ్,రమాదేవి,ఝాన్సీ,సుభాష్ గౌడ్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking