ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 14:
తార్నాక నారాయణ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు
స్వాతంత్రోద్యమ ఘట్టాలు మరియు జాతీయాభిమాన విలువలు పెంచేలా ప్రదర్శనలు, జాతీయ నాయకుల వేషధారణతో చూపిస్తూ జాతి ఔన్నత్యాన్ని తెలిపారు. ఈ సందర్భంగా జి.ఎమ్ గోపాల్ రెడ్డి, ఏజీఎమ్, బాలపరమేశ్వర్ రావ్, ప్రిన్సిపాల్ ఫర్వీన్ లు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు చదువు తో పాటు అన్ని రంగాలలో ప్రాధాన్యత అవసరమన్నారు. రేపటి జాతిని వైభవంగా మార్చే నాయకులుగా మారి జాతికి సేవ చేయడానికి జాతీయ భావాలు కూడా అవసరం అన్నారు. అందుకే విద్యార్థినీ విద్యార్థులలో జాతీయ భావాలు పెరిగేందుకు జాతీయ నాయకుల వేషధారణతో పిల్లలను చూపిస్తూ వారు చేసిన చూపిన త్యాగాల గురించి వివరించామని అన్నారు. దీనికోసం కృషి చేసిన విద్యార్థినీ విద్యార్థులను ఉపాద్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ కోఆర్డినేటర్ ఆజాద్, ఈ చాంప్స్ కో ఆర్డినేటర్ భవాని, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ నూర్,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు