ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 14: బుధవారం రోజు 14-08-2024 న కలెక్టరేట్‌లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ నిర్వహించారు.
అన్ని పట్టణ స్థానిక సంస్థలు (యుఎల్‌బిలు) మరియు గ్రామ పంచాయతీలలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌పై దృష్టి సారించిన అదనపు కలెక్టర్ రాధికా గుప్తా IAS (స్థానిక సంస్థలు). కచ్చితమైన ప్రణాళికతో పక్కాగా సర్వే చెయ్యడానికి, సులభముగా సంబంధిత విషయాలు సకాలంలో పరిష్కరించడానికి గాను శిక్షణతో కూడిన సూచలు అందించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌ కొరకు రెవిన్యూ , టౌన్ ప్లానింగ్ , ఇరిగేషన్ అధికారులు మరియు పంచాయితీ అధికారులతో బృందాలుగా ఏర్పాటుచేసి మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ లో పొందుపరచడానికి కావలసిన ఏర్పాట్లు చేసారు
ఈ సమావేశానికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ ఇంజనీర్లు (నీటిపారుదల శాఖ), ఇతర సంబంధిత అధికారులందరూ హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking