శ్రీరక్ష హాస్పిటల్ వారి రిహబిలిటేషన్ మరియు వెల్నెస్ సెంటర్ (రిహబ్ బుద్ధ) ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి ఆగస్ట్ 14 (ప్రజాబలం) ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి సారిగా అతిపెద్ద రిహాబిలిటేషన్ మరియు వెల్నెస్ సెంటర్ అయినటువంటి( రెహబ్ బుద్ధ ) ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాదులో మాత్రమే లభ్యం అయ్యే ఇటువంటి అరుదైన వైద్య సేవలను ఖమ్మం జిల్లా ప్రజలకు అందిస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు కి శుభాకాంక్షలు తెలియజేశారు ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈ రకమైన వైద్య సేవలు కావలసిన వాళ్లు చాలామంది ఉన్నారని అలాంటివారు ఇప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా మన ఖమ్మం లోనే ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణం లోనే అరుదైన వైద్య సేవలు పొందవచ్చు అని తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ (రిహాబ్ బుద్ధ) లో ఫిజియోథెరపీ హాస్పిస్ పెయిన్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్ వెల్నెస్ మరియు శ్వాసకోశ లివర్ కిడ్నీ గుండె క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నటువంటి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించబడతాయి అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు కమర్తపుమురళి ఐఎంఏ ప్రెసిడెంట్ కంభంపాటి నారాయణరావు బొల్లికొండ శ్రీనివాసరావు ప్రముఖ న్యాయవాది బిచ్చల తిరుమల్ రావు మోత్కూరి నారాయణరావు మరియు వైద్యులు వై రవీంద్రనాథ్ బోడెపుడి అజయ్ కిషోర్ బాబు కూరపాటి ప్రదీప్, పెద్దిరెడ్డి సుధీంద్ర రెడ్డి మరియు శ్రీ రక్షా హాస్పిటల్ వైద్యులు సతీష్ నారాయణచౌదరి ఏడుకొండలు మానస గార్లపాటి వెంకటేష్ బి తేజ్ కుమార్ విమల అంబటి కాశీ విశ్వనాథ్ సత్యజిత్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking