ఏం.జీ పార్కులో బాత్రూమ్స్ కావాలి

గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 7 డిసెంబర్ 2024
మణికొండ మున్సిపలిటి పరిధిలోని అలకాపురి టవున్ షిప్ లో ఉన్న మహాత్మా గాంధీ పార్క్ లో ప్రజల సౌకర్యార్థం బాత్రూమ్స్ కట్టడానికి దాదాపు 18 నెలల క్రితం స్థానిక కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్ కౌన్సిల్ లో ప్రతిపాదించగా, సాంక్షన్ అయినప్పటికి కట్టడం మొదలు పెట్టడం లేదనీ నవీన్ కుమార్ ఆరోపిస్తూ ఇట్టి విషయమై ప్రతి కౌన్సిల్లో అధికారులను నిలదీస్తూ వస్తుండగా గతంలో టెక్నికల్ అనుమతుల వల్ల జాప్యం అయినదని మునిసిపల్ కమీషనర్ చెప్పడం జరిగినదని, ఈ విషయమై తిరిగి కమీషనర్ ను కలిసి ఇప్పటికైనా టెండర్ ప్రక్రియని తొందరగా పూర్తి చెయ్యమని కౌన్సిలర్ విజ్ఞప్తి చేయడం అందుకు బదులుగా కమీషనర్ హామీ ఇస్తూ అతి శీఘ్రముగా టెండర్ ప్రక్రియ మొదలు పెట్టి బాత్రూమ్స్ కట్టడం పూర్తి అవుతుందని కమీషనర్ చెప్పినారనీ నవీన్ కుమార్ ప్రజలందరికీ తెలియ చేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking