నీట్ పరీక్ష అవకతవకలపై సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జితో న్యాయవిచరణ జరిపించాలి
ఎలాంటి ఒత్తిళ్లకు లోను గా కాకుండా మిస్పాక్షికంగా విచారణ జరిపించాలి
ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి దిగంబర్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఈనెల జూన్ 4న విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో 67 మందికి 720 మార్కులకు గాను 720 మార్కులతో ఆల్ ఇండియా మొదటి రావడం అలాగే అందులో ఆరుగురు విద్యార్థులు ఒకే పరీక్ష కేంద్రం నుండి ఉండం పరీక్ష పత్రాలు లీకైనట్లుగా తీవ్రమైన అనుమానాలకు దారితీసిందని నిరుడు ఇద్దరికీ అంతకుముందు నలుగురికి మాత్రమే 720 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంకు రాగ దేశవ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నుండి ఆందోళన చేయడం జరుగుతూనే ఉంది . ఈ సందర్భంగా జిల్లా నిర్మల్ జిల్లా కార్యదర్శి దిగంబర్ మాట్లాడుతూ న్యాయబద్ధమైన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో నిస్పాక్షికంగా విచారణ ఉండాలని, ఎవరైతే విచారణలో దోషులుగా తేలుతాతో వారిని కఠినంగా శిక్షించాలని, వెంటనే నీట్ 2024 పరీక్షను మళ్ళీ నిర్వహించాలని అలాగే సక్రమంగా ఏ పరీక్షను కూడా నిర్వహించలేనటువంటి (ఎన్టిఏ)ను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది .