దేశిని కోటి మాజీ చైర్మన్ ఇల్లంతకుంట దేవస్థానం.
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 8
హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఎన్టిపిసి నుండి వస్తున్న బూడిద లారీలను హుజురాబాద్ లో ఆపి ఓవర్ లోడుతో నడుస్తున్నాయని, 32టన్నుల కంటే అధిక లోడ్ చేసి నడుపుతున్నారని, మంత్రి పొన్నం ప్రభాకర్ ముడుపులు ముడుతున్నాయని ఆరోపించారు. ఈ బూడిద లారీలు, ఇసుక లారీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నడుస్తున్నాయా, గతంలో కూడా నడిచాయా ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో మానేరు వాగు నుండి ఇసుకను ఇష్టానుసారంగా అధిక లోడులతో తీసుకెళ్లారని, అప్పుడు ఈ ప్రాంతంలోని వావిలాల, తనుగుల, గండ్రపల్లి, శాయంపేట, ధర్మారం, కొత్తపల్లితో పాటు హుజురాబాద్ నియోజకవర్గం రోడ్లు మొత్తం ధ్వంసం అయ్యాయని తెలిపారు. రోడ్లు చీధ్రంగా మారి, అస్తవ్యస్తంగా తయారు కావడానికి కారణం అధికలోడు రవాణ కాదా అని ప్రశ్నించారు.
ఆ సమయంలో కౌశిక్ రెడ్డి ఏమయ్యారు..? అప్పుడు ఎందుకు ఆరోపించలేదు..?
ఇప్పుడు ఎందుకు ఆరోపిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బూడిద లారీల యజమాన్యం దగ్గర్నుండి పైసల్ వసూలు చేయడం కోసమే ఎమ్మెల్యే లారీలు ఆపుతున్నాడనంలో సందేహం లేదన్నారు. పోన్నం ప్రభాకర్ ను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, పోన్నం ప్రభాకర్ ను కాదు.. ఈ తెలంగాణ రాష్ట్రం నుండి కౌశిక్ రెడ్డిని భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ద్రోహి, తెలంగాణ ప్రజలపై విద్యార్థులపై రాళ్ళు రువ్విన గుండా పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి పార్లమెంటులో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వీరుడు పోన్నం ప్రభాకర్ అని కొనియాడారు. పొన్నం ప్రభాకర్ కు, నీకు నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా ఉందన్నారు. ఇంకోసారి పోన్నం ప్రభాకర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే నిన్ను ఈ హుజురాబాద్ లో తిరగనియ్యమని హెచ్చరించారు.