గ్రూప్-1పరీక్ష వ్రాసే అభ్యర్థులు ఈ నెల 9న ఉదయం 10 గంటలకు లోపు పరీక్ష కేంద్రంలో ఉండాలి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 08 : జిల్లాలో ఈ నెల 9వ తేదీన జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రోజున అభ్యర్థులు ఉదయం 10 గంటలకు లోపు పరీక్ష కేంద్రంలో ఉండాలి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.శనివారం పరీక్ష ఉదయం 10:30 గంటలకు నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని,10 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని, అభ్యర్థులు,హాల్ టికెట్లను, టీ.జి.పి.ఎస్.సి.వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలిపారు. అభ్యర్థులకు అందించే వ్యక్తిగత ఓ.ఎం.ఆర్ షీట్ల పై సంబంధిత అభ్యర్థులు పాటించవలసిన నియమాలను హాల్ టిక్కెట్ లపై కూడ పరీక్ష కేంద్రం నుండి బయటకు వెళ్లరాదని,ఒకవేళ వెళ్ళినట్లయితే అట్టి అభ్యర్థి ఓ.ఎం.ఆర్ షీట్ షీట్ పరిగణనలోకి తీసుకోకూడదని బయోమెట్రిక్ తీసుకున్నందుకు అభ్యర్థుల వేలిముద్ర పై ఎలాంటి మెహందీ,తాత్కాలిక టాటూస్, ఇతరత్రా ఉండరాదని తెలిపారు. బూట్లు,మొబైల్ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్,పేజర్,ట్యాబ్ లెట్లు,పెన్ డ్రైవ్,బ్లూటూత్ డివైజెస్, వాచ్,మ్యాథమెటిక్స్ టేబుల్స్,లాంగ్ బుక్స్,లాంగ్ టేబుళ్ళు,వ్యాలెట్,హ్యాండ్ బ్యాగ్,జోలాస్,ఫౌచెస్, వ్రెటింగ్ వ్యడ్స్,నోట్స్,చార్ట్స్,లూస్ షీట్స్, జువెల్లరీ,ఇతర ఉపకరణాలు, రికార్డ్ పరికరాలు మొదలగు,ను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరగదని, అభ్యర్థికి సంబంధించిన వస్తువులను బద్రపరిచేందుకు ఎలాంటి సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు.ప్రతి అరగంటకు ఒకసారి సమయాన్ని తెలియజేసేలా గంట మ్రోగించడం జరుగుతుందని అభ్యర్థులు ఇన్విజిలేటర్ల ద్వారా సమయాన్ని తెలుసుకోవచ్చు అని తెలిపారు. అభ్యర్థులు తమ వెంట బ్లూ/బ్లాక్ పాయింట్ ఎంతో పాటు ప్రభుత్వం చే జారీ చేయబడిన ఏదైనా ఒక ఫోటో గుర్తింపు కార్డు,పాస్ పోర్ట్,పాన్ కార్డు,ఓటర్ కార్డు, ఆధార్ కార్డు,ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్,ఇతరత్రా, తీసుకురావాలని,కొత్తగా దిగిన పాస్ పోర్ట్ సైజ్ పోటో, హాల్ టిక్కెట్ పై అతికించిలని తెలిపారు. హాల్ టిక్కెట్ పై ఫోటో సరిగా లేనట్లయితే టి.జి.పి.ఎస్.సి వెబ్ సైట్ లో ఉంచిన అండర్ టేకింగ్ నమూనా తీసుకొని 3 పాస్ పోర్ట్ సైజ్ పోటో ల పై గెజిటెడ్ అధికారుల సంతకం,ఆఖరుగా చదివిన విద్య సంస్థ ప్రిన్సిపాల్ సంతకం తీసుకొని రావాలని తెలిపారు. గ్రూప్-1పరీక్ష నిర్వహణ కొరకు జిల్లాలోని 27 పరీక్ష కేంద్రాల ను ఏర్పాటు చేయడం జరిగిందని,9 వేల 384 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కన్నుల్లోనని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద,144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని,జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనే విధంగా ప్రత్యేక బస్సులు,నిరంతరం విద్యుత్, సరఫరా,వేసవి ఉష్ణోగ్రత దృష్ట్యా ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, మందులు,ప్రథమ చికిత్స కిట్లు సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ,తాగునీరు, ఇతరత్రా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.అభ్యర్థుల సందేహాల నివృత్తి, సహాయం కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 08736-250500 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking