నిలువెత్తు మూర్తి… జగమంత స్ఫూర్తి..

సామాజిక విప్లవ మార్గాన్ని నిర్దేశించిన అంబేడ్కర్‌ బోధనలను
చిత్తశుద్ధితో పాటించడమే ఆయనకు మనమిచ్చే నివాళి
బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం….
హైదరాబాద్ ఏప్రిల్ 15 : మహాత్మా బాబా సాహెబ్” డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 132 వ జయంతి పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం నేతృత్వం లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది వ్యక్తిత్వ నిర్మాణ యుగమని . ఈ యుగ సంకేతంగా ప్రపంచంలో వెలుగొందుతున్న మేధావుల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రసిద్దులని , విద్య మానవుడిని ప్రపంచీకరించాలని కుల వివక్ష కోరల్లోకి దింపకూడదని అంబేడ్కర్‌ ఆశించారని. ఆ కోణంలో ఆయన ప్రపంచ మానవ సంస్కృతికి ప్రతీక. భారత రాజ్యాంగ శిల్పిగా, స్త్రీ విముక్తి ప్రదాతగా, మానవతా దార్శనికుడిగా, బౌద్ధ తత్వబోధకుడిగా, వ్యక్తిత్వ నిర్మాణ దక్షుడిగా,యుగకర్తగా సామాజిక విప్లవ మార్గాన్ని నిర్దేశించిన అంబేడ్కర్‌ బోధనలను చిత్తశుద్ధితో పాటించడమే ఆయనకు మనమిచ్చే నివాళి అని అన్నారు.కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటు పల్లి సురేశ్, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు బిళ్ళ పండరినాథ్, మంగళపల్లి రమేశ్, జయరాజ్ , వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking