చీమలపాడు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి లేని పక్షంలో బాధితుల పక్షాన పోరాడతాం ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 15 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో గల ప్రెస్ క్లబ్ నందు జనసేన పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన ఖమ్మం అసెంబ్లీ కోఆర్డినేటర్ రామకృష్ణ మిర్యాల మాట్లాడుతూ చీమలపాడులో జరిగిన సంఘటన తీవ్ర విషాదకరం,ఈ ఘటన పై ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరుపున సంతాపం వ్యక్తం చేస్తున్నాము.ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్న కారకులు ఎవరు? అసలు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.నిందితులను పట్టుకోవడంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది.ఈ ఘటన పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారా,ఒక వేళా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎందుకు కేసు వివరాలు బయటకు చెప్పడం లేదు అంత గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏముంది? ప్రభుత్వంలో వున్న బి ఆర్ ఎస్ పెద్దలే ఇందులో కుట్ర దాగివుంది అని చెప్తున్నారు.ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడంలేదు. ఎంపీ ఎమ్మెల్యే వ్యక్తులు వచ్చే సభలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుతో పాటు సభ ప్రాంగణంలో.. ఫైర్ ఇంజన్, అంబులెన్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు ఇది భద్రతా లోపం కాదా. అసలు ఈ ఘటనపై ముందుగా ఎంపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.ఇంతటి ఘటనకు కారణంఐనా సభకు అసలు పర్మిషన్ వుందా,ఉంటె పర్మిషన్ కోసం ఇచ్చిన దరఖాస్తులో వున్న వ్యక్తుల పై ఎందుకు కేసు నమోదు చేయలేదు.ఇంతటి అగ్గ్ని ప్రమాదానికి కారణంఐనా బాణ సంచా సామాగ్రిని చీమలపాడు గ్రామానికి తెచ్చింది ఎవరు
కాల్చింది ఎవరు అనే వారి పై కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి అని ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరుపున ప్రశ్నిస్తున్నాం. అలాగే భాదిత కుటుంబాలకు 50లక్షలరూపాయలు ఎక్స్గ్రేషియా మరియు ప్రభుత్వ ఉద్యోగం,మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిహారాన్ని వెంటనే బాధితులకు అందజేయాలని కోరుతున్నాం లేని పక్షంలో భాదిత కుటుంబాలతో ప్రభుత్వంపై జనసేన పార్టీ తరుపున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు మిరియాల జగన్ మోహన్, డేగల రామ చంద్ర రావు, మేడబోయిన కార్తీక్ ,యాసంనేని అజయ్ కృష్ణ ,కట్టా రామకృష్ణ,పుల్లారావు ,తాళ్లూరిడేవిడ్,ఖమ్మం నగర నాయకులు విజయకుమారి దేవేందర్ ,స్రవంత్ ,శ్రీకాంత్,హరి ,రాకేష్,ఉపేందర్ ,వరప్రసాద్ ,నాగుల్ మీరా సతీష్ నరసింహారావు ఆథిక్ బాలకృష్ణ నవీన్,నాగరాజు మనోజ్,క్రాంతి ,తదితరులు పాల్గొన్నారు.