మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెలుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు,శనివారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు అని చెప్పారు, పండుగ పూట పేద ముస్లీమ్ లు పాత బట్టలు ధరించవద్దనే మంచి సంకల్పంతో రంజాన్ తోఫ ను అందిస్తుందన్నారు.షాదీ ముబరక్,కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలు మహిళలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు.అంతకుముందు మున్సిపల్ చైర్మన్ కాంతయ్య మాట్లాడుతూ… ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.సీఎం కేసీఆర్ ముస్లీమ్ ల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నారన్నారు. అనంతరం వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…త్వరలోనే ముస్లీమ్ మైనారిటీలకు రూ.57 లక్షలతో ఫంక్షన్ హాల్ నిర్మించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా ముస్లీమ్ లకు 33 శాతం గృహలక్ష్మీ ఇండ్లలో కేటాయించాలని సభ ముఖంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం సుమారు 270 మంది లబ్దిదారులకు రంజాన్ తోఫ పంపిణీ చేశారు.బతుకమ్మ పండుగ కి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ,క్రిస్మస్ పండుగలకు దుస్తులు పంపిణీ,ఇలా అందరికీ సమానంగా మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు వచ్చింది తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లీమ్ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ సాహిద్ అలీ,డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య,తహసీల్దార్ జ్యోష్న,మున్సిపల్ కమీషనర్ ఆకుల వెంకటేష్,కౌన్సిలర్లు సాయిని సుధాకర్,మెట్టు కళ్యాణి రాజు,సురేష్ నాయక్,బీ ఆర్ ఎస్ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్,ఆర్ ఐ లు సంజీవ్,సమ్మక్క,మున్సిపల్ మేనేజర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking