రామోజీ రావు మృతి పట్ల నిర్మల్ డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు ,కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ సంతాపం
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ప్రముఖ మీడియా నిపుణులు, రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు మృతి పట్ల నిర్మల్ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు,కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సేవలను స్మరించుకుంటు సంతాపం వ్యక్తం చేశారు.రామోజీ కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.రామోజీ సేవలతో పత్రికా, టీవీ, సినిమా రంగాల్లో ఎంతో మందికి ఉపాధి లభించిందని గుర్తు చేశారు. దీంతోపాటు రామోజీ శ్రమ, తపన, నిబద్ధత, క్రమ శిక్షణ కల్గిన మంచి వ్యక్తి అని సుగుణక్క పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు