చారిత్రాత్మక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

నిర్మల్ బుధవారం పట్టణంలోని శ్యామ్ ఘడ్,బత్తీస్ ఘడ్ కోటలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణంలోని పురాతన చారిత్రాత్మక కట్టడాలను అభివృద్ధి పరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చారిత్రాత్మక ప్రదేశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. పట్టణంలోని చారిత్రాత్మక ప్రదేశాలు, కట్టడాలను దశలవారీగా అభివృద్ధి చేయాలని, కోట పరిసరాల్లో ప్రభుత్వ భూమి, పట్టా భూముల హద్దులను గుర్తించాలని సూచించారు. శ్యామ్ ఘడ్ కోట లో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం బత్తీస్ ఘడ్ కోటను సందర్శించి పర్యాటకులను ఆకర్షించే విధంగా అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. హైమస్తు లైట్లను ఏర్పాటు చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ హైమద్, ఆర్ అండ్ బి ఈఈ అశోక్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు,ఇంజనీర్ సంతోష్,తహసిల్దార్ రాజు,అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking