విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగాలలో రాణించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జార్ఖండ్ రాష్ట్రం లో జరిగిన జాతీయ స్థాయి ఖేలో ఇండియా క్రీడాపోటీల్లో పథకాలు సాధించిన జిల్లాకు చెందిన క్రీడాకారులను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీలలో రాణించాలని అన్నారు. ఉన్నత స్థానాల్లో నిలిచేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఇటీవల జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన జాతీయ స్థాయి ఖేలో ఇండియా పోటీల్లో 7వ ర్యాంకు సాధించిన ఎన్. మాధురిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తమిళనాడులో ఫిబ్రవరి 18 నుండి 21 వరకు జరిగిన ఖేలో ఇండియా సౌత్ జోన్ పోటీలలో సబ్ జూనియర్ విభాగంలో పథకాలు సాధించిన జె.నిర్విజ్ఞ, బి.స్వేచ్చా రెడ్డి, జె.కావేరి, డి.నిఖిత, ఆర్.స్వాతి లను పథకాలు, ప్రశంశా పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 26 నుండి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరగనున్న సబ్ జూనియర్ క్రీడా పోటీల్లో నిర్మల్ జిల్లా భైంసా మండలం పాంగ్రి గ్రామానికి చెందిన విద్యార్థి రామ్ చరణ్ పాల్గొననున్నారని తెలిపారు. వ్యాయమ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ లను ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీ.వై.ఎస్.వో నఫే ఖాన్, వ్యాయమ ఉపాధ్యాయులు సాయి కృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్ కె. మాధవరావు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking