ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఈ సందర్భంగా. ఎస్పీ చల్లా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.షీటీమ్స్ బృందాలు మహిళలు, విద్యార్థుల భద్రత,రక్షణ కొరకు పనిచేస్తున్నాయని, ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు గురిచేసిన, మానసికంగా, శారీరకంగా హింసించిన,సోషల్ మీడియాలో ఫోటోలను మార్చి వేధింపులకు గురిచేసిన వారి వివరాలను షిటీమ్ పోలీసులకు సమాచారం ఇస్తే ఆకతాయిలను పట్టుకొని వారు మైనర్ గా ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వడం,మేజర్ గా అయితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు. స్కూల్లో, కాలేజీలలో, అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురిచేసినట్లూ అయితే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అని ఎవరైనా కొత్త వ్యక్తులు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని, సూచించారు.ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ,ఫోక్సో చట్టాల గురించి బాల్య వివాహాల గురించి, మానవ అక్రమ రవాణా,బాలలను అక్రమ రవాణా, బాలలను అక్రమ దత్తత లాంటివి చేయకూడదని ఇలాంటి అక్రమ రవాణాలు జరిగినట్టు మీకు దృష్టికి వస్తే షిటీమ్ పోలీసులకు గాని, 100, 1098, 1930 కి డయల్ చేయాలని, షీటీం వాట్అప్ నం: 8712659550 కు సంచారం అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, షీ టీం ఎస్సై సుమాంజలి, హెడ్ కాన్స్టేబుల్ లింగయ్య, మహిళా కానిస్టేబుల్ రమాదేవి, రాధికా, హోంగార్డు రమాదేవి పాల్గొన్నారు.