ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగలను అరెస్టు చేసినట్టు నిర్మల్ డిఎస్పి గంగారెడ్డి గ తెలిపారు*
కేసు వివరాలు
నిర్మల్ లోని సోఫీ నగర్ సాయి వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్లో దొంగతనానికి పాల్పడిన నలుగురు దొంగలను అరెస్టు చేసినట్టు నిర్మల్ డిఎస్పి గంగారెడ్డి తెలిపారు. స్థానిక వైయస్సార్ కాలనీలో నివాసముండే రాపెన్వాడ్ రఘు తండ్రి:పీరాజి,ఉత్తం పాండురంగ పవర్ తండ్రి:పాండురంగ పవర్,మక్కల శ్రీను తండ్రి: బాలయ్య, జాదవ్ దిలీప్ తండ్రి: తానాజీ మరియు రాపని సోనీ తండ్రి: బాబయ్య అనే మిత్రులు రోజు సాయంత్రం వారి పనుల అనంతరం కలిసి మద్యం తాగేవారు.
రోజు వారి కూలి పని చేసే వీళ్ళు కూలి పని వల్ల వచ్చే డబ్బులు వారు మద్యం త్రాగుటకు,జల్సాలకు. వారి కుటుంబ పోషణకు సరిపోకపోవడం వలన జల్సాలకు డబ్బులు మరియు మద్యం కావాలంటే వైన్స్ షాపుల్లో దొంగతనం చేయాలనీ నిశ్చయించుకున్నారు. మొదటగా పథకం ప్రకారం స్థానిక మయూరి హోటల్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర వైన్స్ మరియు ఖానాపూర్ రోడ్ లోని సిరి వైన్స్ లో దొంగతనం చేసారు.
అదే ప్రకారంగా అర్థరాత్రి సోఫీ నగర్లోని సాయి వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ లో దొంగతనానికి వెళ్లి రెస్టారెంట్ లో ఉన్న కెమెరాలు దానికి సంబందించిన టీవీ ని పగులగొట్టి, తలుపు మరియు షట్టర్ తాళాలు కూడా రాడ్లతో పగులగొట్టి కౌంటర్ లో ఉన్న రూ:ల 40000/ నగదు,ఒక కంప్యూటర్ మరియు కొన్ని మద్యం బాటిళ్ళు దొంగలించినారు. మరునాడు కేసు నమోదు చేసిన నిర్మల్ పట్టణ పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిసిఎస్ పోలీసుల సహకారంతో కేవలం 24 గంటల్లోనే దొంగతనం చేసిన ఏ1. రాపెన్వాడ్ రఘు ఏ2. ఉత్తం పాండురంగ పవర్ తండ్రి:, ఏ3. మక్కల శ్రీను, ఏ4. జాదవ్ దిలీప్ లను ఎంతో కస్టపడి చాచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు వారిని పట్టుకుని వారిని విచారించగా వారు చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నారు.
జల్సాలకి అలవాటు పడి దొంగ తనం చేసిన డబ్బులుని జల్సాలకి ఖర్చుచేసివారు. మిగిలిన సొత్తుని పోలీసు వారు వారి వద్ద నుండి రెండువేల రూపాయలు స్వాధీనపరచుకొని వారిని రిమాండ్ చేయనైనది. నిందితులలో రాపని సోనీ పరారిలో ఉన్నదని తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోలీసు వారు ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రతి ఒక్కరూ తమ తమ వ్యాపార సముదాయాలు మరియు నివాసాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాటి వల్ల నేరాలను అదుపులో చేయవచ్చని కోరారు. దొంగలు నిర్మల్ లో దొంగతనం చేయాలంటే బయపడే విదంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో పెట్రోలింగ్ వ్యవస్తానీ బలోపేతం చేయటం జరిగినది, జిల్లా పోలీస్ సిబ్బంది రాత్రి పగల్లు అలర్ట్ గా ఉన్నారు.దీనికి గత వారం రోజుల్లో పట్టుకున్న దొంగలే ఉదాహరణ.
24 గంటల్లోనే ఈ దొంగతనం ఛేదించి దొంగని పట్టు కోవటం లో చాక చక్యంగా వ్యవహరించిన నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ.లు సాయి కృష్ణ ,ఏం.రవి , రమేష్ నేతృత్వం లో సౌకత్ హెడ్ కానిస్తాబుల్, కానిస్తాబుల్ తిరుపతి , గణేష్.హోమ్ గార్డ్ సతీష్ లను జిల్లా ఎస్పీ డా. జి జానకి షర్మిలా అభినందించారు.