ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు దాటినా… మారని మాధుర్యం ||అమ్మ ప్రేమ • అమ్మ అన్న పదం

అద్భుతం అమ్మ కు అంకితం మన జీవితం.

• ప్రాణం పోసేది దైవం… ప్రాణిని మోసేది అమ్మ

: అమ్మ అన్న పదం అద్భుతం…. అమ్మకి అంకితం మన జీవితం, అమ్మ ప్రేమలోని అప్యాయత, ఆలన పాలన దీనికి సాటిరాకపోగా పిల్లల కోసం అనునిత్యం తపనపడేది అమ్మ. అమ్మ అన్న రెండు అక్షరాలు గొప్ప ప్రేమ బంధాన్ని పెనవే సాయి. సినీకవులు పాడినట్లు పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ… కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ…. వందనాల మ్మా అమ్మా వందనాలమ్మా…. వంద దేవుల్లే కలిసోచ్చినా అమ్మ నీలాగా చూడలేరమ్మ… కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మ… అంటూ పాడినట్లు నిత్యం మాతృమూర్తిని కొలచిన, తలిచిననూ ఎంత పుణ్యమో నవమాసాలు మోసి కనిపించిన తల్లులు బిడ్డల బాగోగుల కోసం పడుతున్న ఆరాటం, తపన అంతా ఇంతా కాదు. నేడు వరల్డ్ మదర్స్ డే దినోత్సవం సందర్భంగా మనం ప్రత్యేక కథనం…..

తల్లులు తమ బిడ్డలకు ఏ చిన్న ఆపద, లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆత్మీయత, అనురాగం, ప్రేమానురాగాలను కలబోసి పెంచుతారు. కష్టా లను ఓర్చి కన్న బిడ్డలను అత్తవారింటికి పంపి న అనునిత్యం వారి యోగ క్షేమాల కోసం విలవి లలాడుతారు. కానీ తల్లులు మాత్రం వారి సుఖ సంతోషాల కోసం ఆలోచించరు. జ్యూసా. ద్యాసా అంతా వారికి కన్నబిడ్డలే తప్ప మరో టిలేదు. కన్నబిడ్డల కోసం తల్లులు నిత్యం వారి యోగ క్షేమాలు, చదువులు, ఎదుగుదల కోసం పరితపిస్తూ తల్లడిల్లుతారు. కానీ సమాజంలో తల్లీ పాత్రకు కొందరు సముచిత స్థానం. ఇవ్వడంలేదు. కన్న తల్లికి అన్నం పెట్టకుండా ఇంటి నుండి గెంటివేస్తున్నారు. తల్లి అన్న బంధాన్ని మరుస్తున్న రాబంధులు ఆస్థుల కోసం నిత్యం గొడవలతో మనశ్శాంతి లేకుండా
చేస్తూ ముసలి వయస్సులో తల్లుల ను హింసించేవారు సమాజంలో పెరిగిపోవడం. తో న్యాయం కోసం తల్లులు రాజు మెట్లు ఎ. క్కుతున్న సంఘటనలు మాతృ బంధానికి మాయని మచ్చలా నిలుస్తున్నాయి.
మదర్స్ డే నేపద్యం.
ఇంగ్లాడ్లో 17 వ శతాబ్దంలో తల్లులకు గౌరవ సూచికంగా మదరింగ్ సండే ఉత్సవాలను చేపట్టారు. అమెరికాలో 1872 లో జూలియవర్డ్ అనే మహిళా తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహిం లని ప్రతిపాదనలు తీసుకురాగా బోస్టన్ లో ఇందుకు ప్రత్యేక సమావేశాలను చేపట్టారు. దీంతో అప్పటి నుండి మే నెల రెండో ఆది వారాన్ని ప్రపంచ తల్లుల దినోత్సవం ను. రికంగా ప్రకటించారు.

.సమాజంలో
అన్నింటి కన్నా గొప్ప తల్లె.

మన సమాజంలో అన్నింటి కంటే గొప్పది. తల్లి అని, మాతృత్వంలో ఉన్న మాధుర్యం అధ్భుతమని తెలిపారు. ప్రతి తల్లి తమ సంతోషాల కన్నా బిడ్డల సంతోషాలనే కోరుకుంటుందన్నారు. తల్లులను ప్రతి ఒక్కరు గౌరవిస్తూ వారికి సముచిత స్థానం ఇవ్వాలన్నారు. (తిరునగరి జోస్న. తెలుగుదేశం పార్టీ జాతీయ కన్వీనర్)

.తల్లికి
సేవ చేస్తే దేవునికి చేసినట్లే.

నవ మాసాలు మోసి కని పెంచి పోషించి న తల్లులకు సేవ చేస్తే దేవుళ్ళకు సేవచేసినట్లేనని, తల్లు లు దేవుళ్ళతో సమానం అన్నారు. అలాగే ఎవరిని మర్చిపో యినా కన్నతల్లిని మాత్రం మరవకూడదని తెలిపారు. అష్టకష్టాలు పడుతూ పిల్లల బాగోగుల కోసం ఆలోచిస్తా రని అమ్మ పేరు పిలుపులోని ఆప్యాయత _మరియు ప్రేమానురాగాలు దీనిలో ఉండవన్నారు.(గీత మూర్తి .బి జే పీ.పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు)

Leave A Reply

Your email address will not be published.

Breaking