రైతుల ఎవరూ ఆందోళన చెందవద్దు

 

పి ఎస్ సి ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 17

రైతులందరూ ఆందోళన చెందవద్దని రెండు లక్షల రుణమాఫీ పిఎసిఎస్ జమ్మికుంట పరిధిలో 102 మందికి రుణమాఫీ వచ్చిందని జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్ అన్నారు. ఈ సందర్భంగా సంపత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని అందులో కొంతమంది రైతులకు ఈనెల 30వ తారీకు వరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అవుతుందని రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రెండు లక్షల రూపాయల పైబడిన రుణం తీసుకున్న రైతులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాగా మిగిలిన డబ్బులను సొసైటీకి చెల్లించి సహకరించాలని అన్నారు. రేషన్ కార్డు లేని వారు ఆధార్ కార్డు ద్వారా రుణమాఫీ పొందవచ్చని మీయొక్క ఖాతాలో గాని ఆధార్ కార్డులో గాని ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వెంటనే స్థానిక ఆబాది జమ్మికుంట రైతు వేదికలో ఏఈఓ అందుబాటులో ఉంటారు కావున రైతులు ఎంఈఓ వద్దకు వెళ్లి తమ యొక్క పొరపాట్లను సరి చేసుకోవాలని సంపత్ రైతులకు సూచన చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking