పలు గ్రామాల్లో వైద్య శిబిరాలు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 17

జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాపక్కపల్లి మరియు శాయంపేట గ్రామాలలో శనివారం డాక్టర్ విజయకుమార్ డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరములు నిర్వహించడం జరిగినది. పాపక్కపల్లి గ్రామములో 53 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ముగ్గురికి జ్వరం రావడంతో వారి రక్త నమూనాలను ల్యాబ్ పంపించారు.అదేవిధంగా శాయంపేట గ్రామములో డాక్టర్ కార్తీక్ 85 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆరుగురికి జ్వరం రావడంతో వారి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించడం జరిగింది. ఈరెండు గ్రామాలలో గ్రామస్తులకి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత దోమలు కుట్ట కుండా తీసుకోవలసిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించి చెప్పడం జరిగింది. వేడి వేడి ఆహార పదార్థాలను తినాలని, త్రాగునీరును వేడి చేసుకుని త్రాగాలని గ్రామస్తులకి సూచించనైనది. ఈ వైద్య శిబిరములలో డాక్టర్ విజయకుమార్, డాక్టర్ కార్తీక్, హెల్త్ ఎడ్యుకేటర్ ఎ మోహన్ రెడ్డి, సూపర్ వైజర్స్ సదానందం,కుసుమకుమారి ఏ ఎన్ ఎం రమా, తిరుమల ఆశకార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking