బెదిరిన హుజురాబాద్, కరీంనగర్ రాజకీయం.. కదిలిన అధికార యంత్రాంగం

– సరి కొత్త రాజకీయాలకు నాంది పలికిన సబ్బని వెంకట్

హుజురాబాద్ నియోజకవర్గం ప్రజా బలం ప్రతినిధి ఆగస్టు 17

సబ్బని వెంకట్ స్పందిస్తేనే పనులు జరుగుతున్నాయి. ఆయన దారిలో నడవడానికి ప్రయత్నిస్తూ, ఉనికి కోసం నాయకులు తాపత్రయ పడుతున్నారు. కరీంనగర్ రాజకీయాల్లో , ప్రజలలో వ్యక్తిగతంగా సబ్బని వెంకట్, ఇమేజ్ రోజు రోజుకూ పెరుగుతూ పోతుంది. ఇందుకు కారణం ఆయన ప్రజా సమస్యల మీద ముందు చూపుతో స్పందించే తీరు తో పాటు విభిన్నమైన నాయకత్వ శైలి కలిగి ఉండటమే. స్థానిక సమస్యల పట్ల పరిష్కరించే ఆలోచన, వ్యక్తిత్వంతో పాటు ఒక విజన్ కలిగిన వ్యక్తిగా, నాయకుడిగా వెంకట్ ను జనం గుర్తిస్తున్నారు. ప్రజలకు మంచి జరిగితే చాలు వ్యక్తిగత ప్రాభవం కోరుకుని నాయకులు చాలా అరుదు. ఆ కోవకు చెందిన వారిలో వెంకట్ ప్రథముడు.

హుజురాబాద్ పొలిటికల్ “గేమ్ చేంజర్”

హుజురాబాద్ లో ఎవరికీ ఏ ఆపద వచ్చిన అందరి కంటే ముందు స్పందిస్తున్నారు. ఆయన హుజురాబాద్ లో అడుగు పెట్టాడంటే మళ్లీ ఏ రాజకీయ అలజడి రేగుతుందేమో అని నాయకులు జంకుతున్నారు, ప్రజలు ఒకింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హుజురాబాద్ పండ్ల మార్కెట్ అగ్నిప్రమాద విషయంలో వెంకట్ స్పందించిన తీరు , సాయం ప్రకటించడం , చెప్పిన సమయానికి అమలు చేయడం , నేటి సమాజంలో సబ్బని కి మాత్రమే సాధ్యమైన అసాధారణమైన విషయం. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు చాలా మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆయన ఇంటి దగ్గర జనజాతరలా తరలి వెళ్లడం.., వారందరి సమస్యలు ఓపిగ్గా విని పరిష్కరించడం , మాట ఇవ్వడం చూసి జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలతో నియోజకవర్గ ప్రజలలో, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలలో , తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉనికిపాటు రాజకీయాలు..

4 రోజుల క్రితం హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రు లలో వైద్యుల కొరత, సదుపాయాలు కల్పించకపోవడం, అధికారుల తీవ్ర అలసత్వం పైన సబ్బని వెంకట్ స్పందించిన వెంటనే అధికారులు నలుగురు వైద్యులను, కొన్ని బెడ్స్ ను కేటాయించారు. ఇదంతా వెంకట్ స్పందించడం వల్లే జరిగింది , కానీ ఈ పనిని రాజకీయ నాయకులు వారి ఖాతాలో వేసుకునే కుటిల రాజకీయం చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలంతా చర్చింకుంటున్నారు. రాష్ట్రం లో ప్రభుత్వం ఏర్పడి , హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి 8 నెలలు అయ్యింది, గత 8 నెలలుగా స్పందించని వారు సబ్బని వెంకట్ సామజిక మాధ్యమాల ద్వారా సమస్యను వైరల్ చేయగానే , పాత్రికేయలు కూడా వార్త ప్రచురించగానే వెంటనే స్థానిక ఎమ్మెల్యే , అధికారపార్టీ ఇన్ చార్జి “మేము చేసాము అంటే మేము చేసాం” అని పత్రిక ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. ఎలక్షన్ సమయంలో చేయవల్సిన రాజకీయం ఇప్పుడు చేయకుండా, ప్రస్తుతం సబ్బని వెంకట్ మాదిరి ప్రజా సమస్యల పైన దృష్ఠ్టి పెడితే బాగుంటుంది అని పలువురు ప్రజలు , సామజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

నలుగురు వైద్యులలో గుండె వైద్య నిపుణులు ఉన్నారా?: సబ్బని వెంకట్

నియోజకవర్గ సమస్యల పైన జిల్లా కలెక్టర్, మెడికల్ ఆఫీసర్ స్పందన పట్ల సబ్బని వెంకట్ హర్షం వ్యక్తం చేసారు. కానీ 100 పడకల ఆసుపత్రికి 4 గురు డాక్టర్లను కేటాయిస్తే ఎలా?,వారితో పాటు ఒక గుండె వైద్య నిపుణుడిని కనీసం జమ్మికుంట , హుజురాబాద్ ఏదో ఒక ఆసుపత్రు లలో కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. ఇటీవల ప్రముఖ న్యాయవాది శ్యామ్ సుందర్ గుండెపోటుతో మృతిచెందడం తీవ్రంగా కలచివేసింది అని, అందుకే తాను వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది అని వెంకట్ తెలిపారు. సరైన సమయంలో హాస్పిటల్ వెళ్లినా కార్డియాలిజిస్టు అందుబాటులో లేకపోవడం వల్లే శ్యామ్ మరణించారని, కావున ఇలాంటి ఘటన వేరే వారికి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు సబ్బని వెంకట్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking