లక్ష ఇళ్లు కుడా కట్టలేదు రాజాసింగ్‌

హైదరాబాద్‌ డబుల్‌ ఇండ్లపై మంత్రి కేటీఆర్‌ కు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కౌంట ఇచచారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల రెండో విడుత పంపిణీ జరిగింది. కేటీఆర్‌.. ఈ కార్యక్రమంలో ఏదేదో మాట్లాడారు. విూరు తెలంగాణలో ఎంతమందికి ఇండ్లు ఇస్తున్నారు. కేటీఆర్‌.. నీకు ఆ డేటా అసలు తెలుసా. ఒకసారి తెలుసుకోండి. 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్‌ ద్వారా తెలిసింది. కానీ లక్ష ఇండ్లు కూడా కట్టలేదు. తెలంగాణ ప్రజలు ఇండ్లు కావాలని అంటున్నారు. విూరు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తారా? సింగిల్‌ బెడ్రూం ఇస్తారా? అనేది ప్రజలకు అనవసరమని అన్నారు. విూరు మంచి చేస్తే ప్రజలు విూకే ధన్యవాదాలు చెబుతారు. 25 లక్షల మందకి పైగా ప్రజలు ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఎంతమందికి కేసీఆర్‌ సర్కార్‌ ఇండ్లు ఇస్తుందో చెప్పాలి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఇండ్లు ఎక్కడా కట్టలేదని కేటీఆర్‌ చెబుతున్నారు. యూపీలో సింగిల్‌ బెడ్రూం ఇండ్లు 15.70 లక్షల ఇండ్లు, మధ్యప్రదేశ్‌ లో 7 లక్షల 80 వేల ఇండ్లు, మహారాష్ట్రలో 11 లక్షల 70 వేల ఇండ్లు, గుజరాత్‌ లో 6 లక్షల 40 వేలు, హర్యానా 2 లక్షల 65 వేల ఇండ్లు, అస్సాంలో 1 లక్ష 55 వేల ఇండ్లు కట్టించి ఇచ్చారు. రెంట్‌ కట్టి కట్టి, గుడిసెలో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. డబుల్‌ ఇండ్ల సంగతి పక్కన పెడితే.. సింగిల్‌ బెడ్రూం ఇండ్లు అయినా ఇవ్వండని ప్రజలు మొత్తుకుంటున్నారు. తెలంగాణలో షోప్‌ టాప్‌ తప్పితే.. ఇండ్లు కూడా ఇవ్వడంలేదు.. కట్టి వదిలేస్తున్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు విూరు ఎన్ని కడుతారో కట్టి ఇవ్వండి.. దాంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింది సింగిల్‌ బెడ్రూం ఇండ్లయినా కట్టించి ఇవ్వండని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking