వికారాబాద్ ప్రజాబలం ప్రతినిధి:గురువారంనాడు వికారాబాద్ జిల్లా, కోటపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం లో పాల్గొన్న మంత్రి పట్నం మహేందర్ రెడ్డిఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఇచ్చిన 6 గ్యారంటీ డిక్లరేషన్ లను ముందు కర్ణాటకలో అమలు చేయాలనీ, కర్ణాటకలో రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రైతులకు కరెంటు లేదు.
తెలంగాణలో ప్రజలను, రైతులను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని, సీఎం కేసీఆర్ గారు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక ఆరోపణ చేస్తున్నారు. జిల్లాలో 65 వేల మంది రైతులకు 353 కోట్ల రుణమాఫీ జరిగింది. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త మార్కెట్లు, కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది. రంగారెడ్డి జిల్లాలో గోదాంల నిర్మాణానికి 38 కోట్లు అందించాం. వికారాబాద్ జిల్లాలో సుమారు 3000 కోట్ల రైతుబంధు రైతులకు అందించాం. జిల్లాలో 236 కోట్ల రైతు బీమాను ప్రమాదవశత్తు మృతి చెందిన రైతులకు అందించాం. ఈ పథకాలు కర్ణాటకలో ఉన్నాయా అంటూ దిశానిర్దేశం చేయడం జరిగింది.
